దేశ రాజధాని ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న బిఆర్ఎస్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:37 గంటల నుండి 12:47 గంటల మధ్య ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. కేసిఆర్ మొదలు పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారని, అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి తన ఛాంబర్ లో కూర్చుంటారని ఈ నిర్మాణ బాధ్యతలు చూస్తోన్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బావసారుప్యత కలిగిన దేశంలోని వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని, కేసిఆర్ సైనికుడిగా ఈ మహోన్నత ఘట్టంలో పాల్పంచుకోడం ఎంతో ఆనందంగా ఉందని ప్రశాంత రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా, కాసేపటి క్రితం బిఆర్ఎస్ కార్యాలయాన్ని కేసిఆర్ సందర్శించారు. రేపటి ఏర్పాట్లపై కొన్ని సూచనలు చేశారు. రుత్వికులతో కలిసి రేపటి పూజా ఏర్పాట్లపై సమాలోచనలు చేశారు.