ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసి) కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసునుంచి ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో ఆమె ఏడాదికి పైగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. 2004-09 మధ్య కాలంలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో ఓఎంసికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని అభియోగాలు వచ్చాయి.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమెను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు సిఎం జగన్ ఆలోచన చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సేకు దృష్ట్యా ఆమె నియామకంపై సందిగ్ధత నెలకొంది. నేడు తెలంగాణా హైకోర్టు కేసు కొట్టి వేయడంతో త్వరలో ఆమె సియేస్ గా నిమితులు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.