వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. యాత్ర సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై, సిఎం కేసిఆర్ పై ఎలాంటి అభ్యంతరక వ్యాఖ్యలు చేయవద్దని… రాజకీయ విమర్శలే కానీ, వ్యక్తిగత విమర్శలు చేయవద్దని షర్మిలను హైకోర్టు ఆదేశించింది. యాత్రపై గతంలో ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నేతలు పాదయాత్ర అనుమతి కోసం కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందని ప్రభుత్వానికి చురకలు అంటించింది. కోర్టు అనుమతి ఇచ్చిన తరువాత పోలీసులు ఎలా నిలిపి వేస్తారని, తెలంగాణా ఏమైనా తాలిబాన్ రాష్ట్రమా అంటూ అసహనం వ్యక్తం చేసింది,
పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ షర్మిల నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈ మేరకుతీర్పు వెలువరించింది. దీనితో రేపటి నుంచి షర్మిల పాదయాత్ర మొదలయ్యే అవకాశం ఉంది. లోటస్ పాండ్ లో పార్టీ నేతలతో షర్మిల సమావేశమయ్యారు.
Also Read : రెండో రోజు వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష