Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్గోలి శ్యామలకు శ్రీనివాస్ గౌడ్ సత్కారం

గోలి శ్యామలకు శ్రీనివాస్ గౌడ్ సత్కారం

అంతర్జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారిణి గోలి శ్యామల తెలంగాణ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అయన క్యాంపు కారాలయంలో కలుసుకున్నారు. కేటాలినా ఐలాండ్ నుండి లాస్ ఏంజెల్స్ వరకు సుమారు 36 కిలోమీటర్ల దూరం నిర్వహించిన స్విమ్మింగ్ అడ్వెంచర్స్ ను పూర్తిచేసి చరిత్ర సృష్టించిన తొలి తెలుగు మహిళ గా నిలిచినందుకు శ్యామలను మంత్రి అభినందించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా అత్యున్నత క్రీడా పాలసీని రూపొందిస్తున్నామన్నారు. గోలి శ్యామల ప్రపంచంలోని సప్త సముద్రాలను ఈది తెలంగాణ రాష్ట్రానికి, మన దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలనే లక్ష్యంతో ఎంతో ప్రమాదకరమైన, కోల్డ్ వాటర్ తో కూడిన లోతైన ప్రాంతమైన అడ్వంచర్ పూర్తి చేశారని ప్రశంసించారు.  అంతర్జాతీయ స్థాయి వేదికలపై స్విమ్మింగ్ విభాగంలో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో మన దేశం – శ్రీలంక దేశాల మధ్య ఉన్న హిందు మహా సముద్రంలో ఉన్న పాక్ జల సంధిని (30 కిలోమీటర్లు) ఈదిన రెండో మహిళగా కూడా శ్యామల చరిత్ర సృష్టించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కెఎస్ శ్రీనివాస రాజు, ఎం.ఎల్.ఆర్. విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, గోలి శ్యామల భర్త దీపక్, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ కోశాధికారి ఉమేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్