తెలంగాణకు చెందిన బుర్రా లాస్య మహిళ క్రికెట్ కోచ్ గా ICC – అకాడమీ కోచ్ ఎడ్యుకేషన్ కోర్సులో Leval -1 సర్టిఫికెట్ సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి, శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో లాస్యను అభినందించారు. తెలంగాణ రాష్ట్రం నుండి తొలిసారిగా మహిళ క్రికెట్ కోచ్ గా ఎన్నిక కావడం సంతోషమని మంత్రి పేర్కొన్నారు. బుర్రా లాస్య తండ్రి బుర్రా రమేష్ గౌడ్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉన్నారు.
శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారు ప్రత్యేక విజన్ తో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను తయారు చేయడం కోసం సుమారు 8500 గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామన్నారు. క్రీడా పాలసీ లో క్రీడాకారులకు, కోచ్ లకు పెద్దపీట వేస్తున్నామన్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. అలాగే, క్రీడా రంగంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తన్నామన్నారు శ్రీనివాస్ గౌడ్.
లాస్య రాబోయ కాలంలో తెలంగాణ రాష్ట్రం గర్వించే విధంగా మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.