Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్26న బ్రహ్మకుమారీస్ స్పోర్ట్స్ కాంక్లేవ్

26న బ్రహ్మకుమారీస్ స్పోర్ట్స్ కాంక్లేవ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కేసిఆర్ క్రీడల అభివృద్ధి, లిక సదుపాయాలు కల్పనకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా మైదానాన్ని, 6 వేల గ్రామాల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు. బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో నవంబర్ 26 న హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించనున్న స్పోర్ట్స్ కాంక్లేవ్ కు సంబంధించిన వాల్ పోస్టర్,  స్పోర్ట్స్ క్యాంపెయిన్ వెహికల్ ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో 2శాతం, ఉన్నత విద్యలో 0.5% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. ఇటీవల గుజరాత్ లో జరిగిన జాతీయ క్రీడల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారిస్ స్పోర్ట్స్ కాంక్లేవ్ ను నిర్వహిస్తున్నందుకు మంత్రి అభినందించారు.

స్పోర్ట్స్ కాంక్లేవ్ లో భాగంగా ఈనెల 15 నుండి 22 వరకు బ్రమ్మకుమారిస్ ఆధ్వర్యంలో వివిధ క్రీడా అకాడమీ లు, పాఠశాలల్లో ‘బాడీ అండ్ మైండ్ – ఫిట్ అండ్ ఫైండ్’ శీర్షికన… క్రీడాకారులు తమ మానసిక ఒత్తిడి మాయం చేసుకునేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు పాజిటివ్ ఆలోచనలు, ఒత్తిడి నియంత్రణ, మెడిటేషన్ తో వ్యక్తిగత, వృత్తిపరమైన పనితీరు మెరుగుపర్చుకునేదుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారని మంత్రి అన్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాన్ని బ్రహ్మకుమారి సంస్థ రూపొందించి క్రీడాకారులకు అందించడం ఎంతో గొప్ప విషయం అన్నారు క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా ఫిట్నెస్ తో ఉండి తమ లక్ష్యాలను  సాధించుకోవాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

బ్రహ్మ కుమారిస్ డైరెక్టర్ BK కులదీప్ దీదీ, స్టేట్ గాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డా. లక్ష్మీ, స్పోర్ట్స్ కో – ఆర్డినేటర్ లు సిస్టర్ వసంత, బ్రదర్ వంశీధర్ లు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్