హైదరాబాద్ అందాలను చూడడానికి వచ్చే టూరిస్టుల కోసం టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ “హైదరాబాద్ దర్శిని” పేరిట సిటీలో తిరిగే రెండు స్పెషల్ బస్సులను ప్రారంభించడం జరిగింది..
పర్యాటక రంగాలను మరింత అభివృద్ధి చెందే విధంగా ఆర్టీసీ సంస్థ నేరుగా పర్యటక మరియు చారిత్రక ప్రదేశాల వద్దకు బస్సు సర్వీసులను నడపడం సంతోషంగా ఉందని చెప్పారు.
హైదరాబాద్ నగర టూరిస్టులకు అణువుగా ఆర్టీసీ “హైదరాబాద్ దర్శిని” బస్సు సర్వీసులను ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేశారు. ఆయన హైదరాబాద్ నగర పర్యటక ప్రదేశాలను చారిత్రక కట్టడాలను 12 గంటల్లో చుట్టేసి వచ్చే విధంగా షెడ్యూల్ సిద్ధం చేశారు. ఈ బస్సు సర్వీసులు శనివారం, ఆదివారం సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుండి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు నడపడం జరుగుతుంది.
ఈ ప్యాకేజీలకు ఆదరణ పెరిగితే మిగతా రోజుల్లో కూడా విస్తరిస్తామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
“హైదరాబాద్ దర్శిని” సిటీ టూర్ ఇలా..!!
1. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుండి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
2. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బిర్లా మందిర్ దేవస్థానం దర్శనం..
సమయం 9:00 గంటల నుండి 10:00
3. చౌ మొహాల్ల ప్యాలెస్ సందర్శన.
సమయం ఉదయం 10:30 నుండి 12 గంటల 30 నిమిషాల వరకు.
4. పర్యాటక ప్రదేశమైన తారామతి బారదరి రిసార్ట్స్ లో మధ్యాహ్నం భోజనం.
సమయం 13:00 నుండి 13:45 వరకు.
5. గోల్కొండ కోట సందర్శన
సమయం 14:00 నుండి 15:30 వరకు.
6. దుర్గం చెరువు పార్క్ సందర్శన
సమయం 16:00 నుండి 17:00 వరకు.
7. కేబుల్ బ్రిడ్జ్ సందర్శన
సమయం 17:30 నుండి 18:00 వరకు.
8. హుస్సేన్ సాగర్ మరియు ఎన్టీఆర్ పార్క్ సందర్శన
18:30 నుండి 19:30 వరకు.
పర్యటక మరియు చారిత్రక ప్రాంతాలను వీక్షించిన అనంతరం తిరిగి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్దకు రాత్రి 20.00 చేర్చడం జరుగుతుంది.
గమనిక అల్పాహారం మరియు భోజన ఖర్చు ప్రయాణికులదే దీనిలో 10% డిస్కౌంట్..
టిఎస్ ఆర్టిసి మెట్రో ఎక్స్ప్రెస్.
1. పెద్దలకు 250 రూపాయలు.
2. పిల్లలకు 130 రూపాయలు.
టీఎస్ ఆర్టీసీ మెట్రో లగ్జరీ A/C
1. పెద్దలకు 450 రూపాయలు.
2. పిల్లలకు 340 రూపాయలు.
టికెట్లు బుక్ చేసుకోవడానికి టిఎస్ ఆర్టిసి వెబ్సైట్ను www.tsrtconline.in సందర్శించండి.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాలను కళాశాల విద్యార్థులు మరియు యాజమాన్యాలు, పాఠశాల విద్యార్థులు, మరియు ప్రకృతి ప్రేమికులు విహారయాత్రలు చేసేవారు సద్వినియోగం చేసుకోవాలని గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు తెలియజేశారు..
Also Read : హైదరాబాద్లో 90 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్