మహారాష్ట్ర రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. శివసేన అధినేత ఉద్దావ్ థాకరే ముఖ్యమంత్రి పదవికి కొద్ది సేపటి క్రితం రాజీనామా చేశారు. గత వారం రోజులుగా సాగుతున్న కమలనాథుల ఎత్తుగడలు చివరి అంకానికి చేరుకున్నాయి. రెబెల్ ఎమ్మెల్యేలు, శివసేన వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు అనుమతించింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం రేపు ఉదయం పదకొండు గంటలకు ఉద్దావ్ ధాకరే ప్రభుత్వం సభ విశ్వాసం పొంది బలనిరుపన చేసుకోవాలి.
మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్రాన్ని ఉద్దేశించి ఈ రోజు సాయంత్రం ప్రసంగించారు. రైతులకు రుణమాఫీ చేసి.. రైతుల పంట రుణాలను మాఫీ చేశామన్నారు. సీఎం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ శివసేన ప్రతి ఒక్కరికి సహాయం చేసిందని, సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నవారిని ఒక స్థాయికి తీసుకొచ్చిందని, చాలా సాధారణ ప్రజలను పెద్దగా చేసిందని అన్నారు. సేన వారికి అన్నీ ఇచ్చింది.
అంతకుముందు ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా మారుస్తూ మహారాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా మార్చడాన్ని కాంగ్రెస్, ఎన్సీపీ వ్యతిరేకించలేదని ఉద్దావ్ ధాకరే అన్నారు.
Also Read : మహారాష్ట్రలో బిజెపి పద్మవ్యూహం