ఈ శుక్రవారం గోపీచంద్ నటించిన ‘రామబాణం’ విడుదల కానుంది. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్లో లక్ష్యం, లౌక్యం చిత్రాలు రూపొందడం.. ఈ రెండు చిత్రాలు విజయం సాధించడంతో ఈసారి హ్యాట్రిక్ సాధిస్తారని టీమ్ అంతా గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇందులో జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. టీజర్ అండ్ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక శుక్రవారమే వస్తున్న మరో సినిమా ‘ఉగ్రం’. అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్లో నాంది సినిమా వచ్చింది. సీరియస్ సబ్జెక్ట్ తో వచ్చిన ‘నాంది’ విజయం సాధించింది. ఇప్పుడు కాంబినేషన్ లోనే ఉగ్రం సినిమా వస్తుండడంతో ఈ సినిమా పై కూడా పాజిటివ్ టాక్ ఉంది. ఇందులో అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపించాడని ట్రైలర్ ను బట్టి తెలుస్తుంది. అయితే.. గోపీచంద్ రామబాణం, అల్లరి నరేష్ ఉగ్రం.. ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల అవుతుండడంతో ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజేతగా నిలుస్తుంది అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
గత వారం రిలీజైన ఏజెంట్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మే నెల ఫస్ట్ వీక్ లో వస్తున్న ఈ రెండు చిత్రాల్లో ఒక సినిమా విన్నర్ గా నిలుస్తుందా..? లేక రెండు సినిమాలు విజయం సాధిస్తాయా..? అనేది ఆసక్తిగా మారింది.