Saturday, January 18, 2025
HomeTrending Newsబ్రిట‌న్ వైద్య బృందానికి ధ‌న్య‌వాదాలు - మంత్రి హ‌రీశ్‌

బ్రిట‌న్ వైద్య బృందానికి ధ‌న్య‌వాదాలు – మంత్రి హ‌రీశ్‌

హైద‌రాబాద్ నిమ్స్‌, నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో ప‌సి పిల్ల‌ల‌కు హార్ట్ స‌ర్జ‌రీలు నిర్వ‌హించి, వారి ప్రాణాల‌ను కాపాడిన బ్రిట‌న్ వైద్య బృందానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. నిమ్స్ ఆస్ప‌త్రిలో యూకే వైద్యుల‌కు నిర్వ‌హించిన స‌న్మాన కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ సందర్బంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. పసి హృదయాల‌ను కాపాడేందుకు, త‌మ‌ ఆహ్వానం మేరకు నిమ్స్ ఆస్ప‌త్రికి వచ్చిన బ్రిటన్ వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ వెంకట రమణ దన్నపనేని తమ బృందంతో వచ్చి నిలోఫర్, నిమ్స్ వైద్యులకు సహకారం అందించారు. అందరూ కలిసి 9 మంచి చిన్నారులకు సర్జరీలు నిర్వహించారు. ఎక్మో మీద ఉన్న చిన్నారికి కూడా సర్జరీ చేయడం గొప్ప విషయం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. వైద్యులు పుట్టిన గ‌డ్డ‌కు మేలు చేయాలి..
ఒక్కో సర్జరీని 20 మందితో కూడిన‌ వైద్య బృందం 4-5 గంటల పాటు చేశారు. 9 మంది ప్రాణాలు కాపాడార‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్ బీరప్పకు, నిలోఫర్ సూపరింటెండెంట్ ఉషారాణికి, సర్జరీలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పారు. పుట్టిన రాష్ట్రంలోని ప్రజలకు సేవ చేయాలని వచ్చిన డాక్టర్ రమణకు ప్రత్యేక అభినందనలు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు పుట్టిన గడ్డకు మేలు చేయాలని మంత్రి హ‌రీశ్‌రావు పిలుపునిచ్చారు. విదేశీ నిపుణులను తీసుకొచ్చి ఇలాంటి క్లిష్టమైన సర్జరీలు చేసిన సందర్భం ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత ప్రభుత్వ నిమ్స్ లోనే జరిగింద‌ని హ‌రీశ్ రావు గుర్తు చేశారు.

ప‌సి పిల్ల‌లు న‌వ్వుతుండే మ‌న‌సు నిండిపోయింది..
చిన్న పిల్లలకు గుండె సర్జరీ చేయడం అనేది అత్యంత క్లిష్టమైన, ఖరీదైన వైద్యం అని మంత్రి పేర్కొన్నారు. దీనికోసం ప్రైవేటులో లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. మన నిమ్స్ లో ఈ 9 మంది చిన్నారులకు పూర్తి ఉచితంగా సర్జరీలు చేయడం జరిగింద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు ఈ రోజు ఎంతో సంతోషంగా అనిపించింది. సర్జరీ తర్వాత ఆ పిల్లలు నవ్వుతుంటే మనసు నిండిపోయింద‌ని హ‌రీశ్ రావు తెలిపారు. 5,400 మందికి గుండె జ‌బ్బులు
తెలంగాణ లో ప్రతి సంవత్సరం 6 లక్షల మంది పిల్లలు పుడుతున్నారని హ‌రీశ్‌రావు తెలిపారు. వీరిలో 5,400 మంది పిల్లలకు గుండె జబ్బులు ఉంటున్నాయి. వారిలో 1000 మందికి శస్త్ర చికిత్స అవసరం అవుతుంద‌న్నారు. కార్పొరేట్‌కి వెళ్ళలేక, సరైన సమయంలో వైద్యం అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే, తెలంగాణ ప్రభుత్వం మానవీయకోణంలో అలోచించి వీరికి శస్త్ర చికిత్సల కొరకు ప్రభుత్వ ఆస్ప‌త్రులలో మౌళిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని హ‌రీశ్‌రావు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్