Friday, March 29, 2024
HomeTrending Newsబ్రిటన్ ప్రధాని రేసులో మళ్ళీ బోరిస్ జాన్సన్

బ్రిటన్ ప్రధాని రేసులో మళ్ళీ బోరిస్ జాన్సన్

లిజ్​ ట్రస్​ అనూహ్య రాజీనామాతో బ్రిటన్​లో రాజకీయ సంక్షోభం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక మళ్లీ ప్రధాని రేసు మొదలైంది. తదుపరి ప్రధాని రేసులో ఉన్నట్టు రిషి సునక్​ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటివరకు పెన్నీ మోర్డౌంట్​ మాత్రమే.. బ్రిటన్​ ప్రధాని రేసులో అధికారికంగా చేరారు. తాజాగా.. బ్రిటన్​ మాజీ ప్రధాని బోరిస్​ జాన్స్​న్​ కూడా రేసులోకి వచ్చారు.

మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మరోసారి ఆ పోస్టుపై కన్నేశారు. కరీబియన్‌ దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్న బోరిస్‌.. హుటాహుటిన మళ్లీ బ్రిటన్‌కు బయలుదేరారు. ప్రధాని రేసునుంచి తప్పుకోవాలంటూ రిషి సునాక్‌ను కోరినట్లు సమాచారం. కష్టకాలంలో పార్టీని కాపాడుకోవడం చాలా ముఖ్యమని.. ప్రధాని రేసు నుంచి తప్పుకుని తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే బోరిస్​ మళ్లీ ప్రధాని బాధ్యతలు తీసుకుంటే.. బ్రిటన్​ ఆర్థిక వ్యవస్థ మరింత పతనమవుతుందని.. రిషి సునక్​ మద్దతుదారులు ప్రచారాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

పార్టీ నాయకత్వాన్ని చేపట్టాలన్నా, లేక ప్రధాని కావాలన్నా.. కనీసం వంద మంది ఎంపీలు మద్దతు తెలపాలి. ప్రస్తుతం ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్‌కు వంద మంది ఎంపీలు మద్దతిచ్చారు. ఇక, బోరిస్‌ జాన్సన్‌కు ఇప్పటి వరకు 44 మంది మద్దతు ఇవ్వగా… పెన్నీ మోర్డాంట్‌కు 21 మంది మద్దతు ఉంది. అయితే ఇప్పటి వరకు సునాక్‌, జాన్సన్‌ అధికారికంగా ప్రచారం మొదలుపెట్టలేదు. కానీ వాళ్లకు మాత్రం టోరీ పార్టీ ఎంపీలు మద్దతు ముందే ప్రకటించారు. ముగ్గురిలో రిషి సునాక్‌కు ఎక్కువ మంది మద్దతు లభించడంతో.. ఆయన బ్రిటన్ ప్రధాని రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈసారి కేవలం ముగ్గురు మాత్రమే ప్రధానమంత్రి రేసులో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. కనీసం 100మంది కన్జర్వేటివ్​ ఎంపీల మద్దతు ఉంటేనే.. ఎవరైనా ప్రధాని రేసులోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. తదుపరి   ప్రధాని ఎవరు అనే అంశంపై అనేక సంస్థలు సర్వేలు చేపడుతున్నాయి. ఒక ఒపీనియన్​ పోల్​ ప్రకారం.. మోర్డౌంట్​, జాన్సన్​ కన్నా ఓటర్లు రిషి సునక్​వైపే మొగ్గుచూపొచ్చని తేలింది. సర్వేలో పాల్గొన్న 44శాతం మంది రిషి సునక్​కే తమ మద్దతు తెలిపారు.

Also Read : సోషల్ మీడియా పైత్యం

RELATED ARTICLES

Most Popular

న్యూస్