Saturday, June 13, 2026
Homeస్పోర్ట్స్సౌతాఫ్రికాతో టి -20 సిరీస్ : ఉమ్రాన్ కు చోటు

సౌతాఫ్రికాతో టి -20 సిరీస్ : ఉమ్రాన్ కు చోటు

KL to lead: సౌతాఫ్రికాతో  స్వదేశంలో జరగనున్న ఐదు మ్యాచ్ ల టి-20 సిరీస్ కు  కెఎల్ రాహుల్  కెప్టెన్ గా 18 మందితో కూడిన  జట్టును బీసీసీఐ  ప్రకటించింది. అందరూ ఊహించినట్లే  ఉమ్రాన్ మాలిక్ కు  తొలిసారి జాతీయ జట్టులో స్థానం దక్కింది. ఐపీఎల్  లో సన్ రైజర్స్  హైదరాబాద్ జట్టుకు ఆడుతోన్న ఉమ్రాన్  అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఉమ్రాన్ తో పాటు ఆర్ష దీప్ సింగ్ కు కూడా జాతీయ జట్టులో తొలిసారి స్థానం సంపాదించాడు.

విరాట్  కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, షమీలకు విశ్రాంతి కల్పించారు.   ఐపీఎల్  బెంగుళూరు జట్టులో  ఆడుతూ అద్భుతమైన ఫామ్ కనబరుస్తోన్న దినేష్ కార్తీక్ కు కూడా  చోటు దక్కింది.

జట్టు వివరాలు:

కెఎల్ రాహుల్ (కెప్టెన్ ), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్,  రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్,  రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్,

జూన్ 9,12,14,17,19 తేదీల్లో  వరుసగా ఢిల్లీ, కటక్, విశాఖ పట్నం, రాజ్ కోట్, బెంగుళూరు ల్లో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular