Thursday, February 20, 2025
HomeTrending Newsమీరు ఉన్నంతకాలం ఈ దేశం తలవంచదు: పవన్

మీరు ఉన్నంతకాలం ఈ దేశం తలవంచదు: పవన్

ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి 91 శాతం స్థానాలు కైవసం చేసుకుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మోడీ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని, ఆయన చేపట్టిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ… కామాఖ్యనుంచి ద్వారక వరకూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించారని, స్ఫూర్తిని నింపారని కొనియాడారు. ఎన్డీయే పార్టీల ఎంపిల సమావేశంలో పవన్ ప్రసంగించారు. 2014లో కూడా తాము ముగ్గురం కలిసి పనిచేశామని… మోడీ 15 ఏళ్ళ పాటు ఈ దేశాన్ని పాలిస్తారని చంద్రబాబు చెప్పారని.. ఇప్పుడు అది నిజమైందని పవన్ వెల్లడించారు.

‘మీరు ప్రధానిగా ఉన్నంత కాలం ఈ దేశం ఎవరికీ తలవంచదు.   మీ మద్దతుతో ఏపీలో భారీ మెజారిటీతో గెలిచాం. జనసేన తరఫున మిమ్మల్ని ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా బలపరుస్తున్నా, ఆయనకు హృదయ పూర్వక ధన్యవాదాలు’ అంటూ మోడీపై ప్రసంసల వర్షం కురిపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్