Monday, February 24, 2025
HomeTrending Newsనాసిన్ కు భూమిపూజ

నాసిన్ కు భూమిపూజ

NACIN: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్) అకాడమీ పనులకు భూమి పూజ చేశారు.

 కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మలాగుండ్ల శంకర నారాయణ, కేంద్ర నెహ్రూ యువకేంద్రం (ఎన్ వై కెఎస్) వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) కేతన్ గార్గ్,  పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Also Read : మొత్తం ఖర్చు మాదే: షెకావత్

RELATED ARTICLES

Most Popular

న్యూస్