Sunday, January 19, 2025
HomeTrending Newsచనాక -కొరాట కు గ్రీన్ సిగ్నల్

చనాక -కొరాట కు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో గల పెన్‌గంగపై జైనథ్‌ మండలం కొరాట గ్రామం వద్ద  తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తోన్న చనాక – కొరాట బ్యారేజీకి పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ – అటవీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అనుమతుల సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జలవనరుల శాఖకు అధికారికంగా పంపింది.

ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదిలాబాద్‌, భీంపూర్‌, జైనథ్‌, బేల మండలాల్లోని 89 గ్రామాల పరిధిలో గల 51 వేల ఎకరాలకు సాగునీరు అందునుంది. ప్రధాన కాలువల కోసం ప్రభుత్వం రూ.397.82 కోట్లు మంజూరు చేసింది. రూ.106.71 కోట్లతో పంప్‌హౌస్‌, లోయర్‌ పెన్‌గంగ ప్రధాన కాలువ నిర్మాణానికి రూ.234.8 కోట్లు, డిస్ట్రిబ్యూటరీల కోసం రూ.148.43 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే బరాజ్‌, ప్రధాన కాలువలు, పంప్‌హౌస్‌ పనులు పూర్తయ్యాయి. 0.83 టీఎంసీల నీటినిల్వ గల బరాజ్‌కు 23 పిల్లర్లతో గేట్లు బిగించారు.  కేంద్ర జలమంత్రిత్వ శాఖ కూడా తుది అనుమతులు ఇచ్చింది. తాజాగా అటవీ పర్యావరణ శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు ట్రయల్ రన్స్ ను చేపట్టనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్