Nothing doing: అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నా కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. భారత రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులతో నేడు కూడా అగ్నిపథ్ పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. త్రివిధదళాల్లో రెగ్యులర్ నియామకాలు ఇక నుంచి ఉండబోవని భారత మిలిటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి స్పష్టం చేశారు. కేవలం అగ్నిపథ్ పథకం ద్వారా మాత్రమే నియామకాలు జరుగుతాయని ప్రకటించారు. గతంలో రెండు పరీక్షలు పూర్తి చేసుకున్న వారు కూడా అగ్నిపథ్ పథకంలో చేరాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకం వెనక్కి తీసుకోబడదన్నారు. ఇకపై సాయుధ బలగాల్లో అగ్నిపథ్ పథకం ద్వారానే భర్తీ చేస్తామని, సాధారణ భర్తీలు ఉండవని చెప్పారు.
అగ్నిపథ్ యువతకు మేలు చేస్తుందని, భారత సైన్యానికి క్రమశిక్షణ తప్పని సరి అని అయన యువతకు పిలుపు ఇచ్చారు. కోచింగ్ సంస్థలు అభ్యర్ధుల వద్ద డబ్బులు తీసుకున్నాయని అందుకే వారిని రెచ్చగొట్టి ఉద్యమానికి పురిగొల్పాయని అనిల్ పూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని వీర్ విషయంలో ఒక అండర్ టేకింగ్ తీసుకుంటామని, తాము అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలల్లో పాల్గొనలేదని తప్పనిసరిగా అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుదన్నారు. పోలీసుసేవల నియామకాల్లో అగ్నివీర్ లను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరతామని తెలిపారు.
ఈ పథకంలో భాగంగా త్రివిధ దళాధిపతులు నియామకాలకు సంబంచించిన షెడ్యూల్ విడుదల చేశారు
సైన్యం (ఆర్మీ) తరఫున లెఫ్ట్ నెంట్ జనరల్ బన్సి పొన్నప్ప, వాయుసేన నియామకాల కోసం ఎయుర్ మార్షల్ సూరజ్ ఝా, నావికా దళం కోసం వైస్ అడ్మిరల్ డి.కే. త్రిపాఠీలు షెడ్యూల్ విడుదల చేశారు. వీరు విడుదల చేసిన షెడ్యూల్ లోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి.
ఆర్మీ:
- జులై 1 న నోటిఫికేషన్ జారీ
- దేశంలోని అన్ని రాష్ట్రాలలో 83 ర్యాలీలను నిర్వహిస్తాం. అన్ని గ్రామాల నుంచి ఎంపిక చేస్తాం.
- ఆగస్టు మొదటివారంలో ర్యాలీలు ప్రారంభం అవుతాయి. మొదట ఫిజికల్, మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్ లు. తర్వాత ఎంట్రన్స్ టెస్ట్.
- ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లలో ర్యాలీలు నిర్వహిస్తాం. రెండు బ్యాచ్ లుగా ఎంపిక చేసి శిక్షణా కేంద్రాలకు పంపుతాం.
- తొలి విడతగా సుమారు 25 వేల మందిని డిసెంబరు మొదటి వారం కల్లా ఎంపిక చేస్తాం.
- ఫిబ్రవరి 23 కల్లా రెండవ బ్యాచ్ ఎంపిక పూర్తవుతుంది.
- మొత్తం గా ఆర్మీ కోసం 40 వేల మంది ని “అగ్నిపథ్” పథకం కింద ఎంపిక చేస్తాం.
“అగ్నివీరుల” (వాయుసేన)నియామకం
- మొదటి “అగ్నివీరు”లకోసం జూన్ 24 న, నోటిఫికేషన్, ఆన్‌లైన్ రిజస్ట్రేషన్.
- సరిగ్గా నెల తర్వాత, జులై 24 నుంచి మొదటి విడత బ్యాచ్ ఆన్‌లైన్ పరీక్ష ప్రారంభం.
- ఈ ఏడాది చివరికల్లా మొదటి బ్యాచ్ ఎంపిక.
- డిసెంబర్ 30 న తొలి బ్యాచ్ కు శిక్షణ ప్రారంభం.
నావికా దళం
- ఎంపిక ప్రక్రియను ఇప్పటికే సిధ్దం చేశాం.
- జూన్ 25 కల్లా కేంద్ర సమాచార, ప్రసార శాఖకు ప్రకటనలు అందజేస్తాం.
- ఒక్క నెలలోనే ఎంపిక ప్రక్రియ ప్రారంభమౌతుంది.
- నవంబర్ 21 మొదటి బ్యాచ్ “అగ్నివీరు”లను ఒరిస్సా శిక్షణా కేంద్రానికి పంపడం జరుగుతుంది.
- మహిళా “అగ్నివీరు”లను కూడా ఎంపిక చేస్తాం
Also Read : అగ్నిధార- అశ్రుధార