Sunday, November 3, 2024
HomeTrending Newsభారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం!

భారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం!

మెసేజింగ్ యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు  ఈ యాప్ వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల పై ప్రస్తుతం కేంద్ర హోంశాఖ, ఐటీ శాఖ సహకారం తో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(I4C) విచారణ జరుపుతున్నది. టెలిగ్రామ్ లో  అక్రమ కార్యకలాపాలతో పాటు ఇది భారతదేశ ఐటీ నిబంధనలను పాటిస్తున్నదా అనేది విచారణ లో తేలనుంది.

రెండ్రోజుల క్రితం టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్‌ దురోవ్‌ను(39) పారిస్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అజర్‌బైజాన్ నుంచి లే బోర్గట్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు.

టెలిగ్రామ్​లో మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, పిల్లలపై నేరాలు, పెడోఫిలిక్ కంటెంట్‌, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం లాంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.  గతంలో అరెస్టు వారెంట్‌ జారీ చేసిన అధికారులు, తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అయితే, తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటి నుంచి దురోవ్ ప్రాన్స్, యూరప్​లోని దేశాల్లో పర్యటించలేదు. తాజాగా లే బోర్గట్‌ వచ్చిన పావెల్‌ దురోవ్‌ను అరెస్ట్ చేసినట్లు మాస్కో టైమ్స్ పేర్కొంది.  దురోవ్ రష్యాలో జన్మించారు. ప్రస్తుతం అయన దుబాయ్​లో ఉంటున్నారు. టెలిగ్రామ్​ యాప్​ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 900 మిలియన్ల మంది వినియోగిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్