Monday, January 20, 2025
HomeTrending Newsరామచంద్రయాదవ్ కు కేంద్ర భద్రత

రామచంద్రయాదవ్ కు కేంద్ర భద్రత

బిజెపి నేత, పుంగనూరు నియోజకవర్గానికి చెందిన B. రామచంద్రయాదవ్ కు Y ప్లస్ భద్రత కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక భద్రతా సిబ్బంది పుంగనూరుకు చేరుకుంది.  ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయకుండా మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలంతో  అధికార పార్టీ నాయకులు పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 2022 డిసెంబర్ 4వతేదీ సదుంలో రైతుభేరి బహిరంగసభ నిర్వహించాలని తలపెట్టారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదని,  ఆర్సీవై మెగా జాబ్ మేళా ద్వారా 10 వేల మంది Edit date and time నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా పోలీసులు అడ్డుకున్నారని అంటూ ఈ విషయాలపై కేంద్ర హోం శాఖకు  బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రామచంద్ర యాదవ్ కు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు పదిరోజుల్లోనే ఆయన దీనిపై నిర్ణయం తీసుకుని కేంద్ర భద్రతా బలగాలను పంపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్