Sunday, February 23, 2025
Homeసినిమాసాయి ధరమ్ ను పరామర్శించిన కిషన్ రెడ్డి

సాయి ధరమ్ ను పరామర్శించిన కిషన్ రెడ్డి

Sai Dharam Tej: హీరో సాయి ధరమ్ తేజను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పరామర్శించారు. నేడు సాయి ధరమ్ నివాసానికి వెళ్ళిన కిషన్ రెడ్డి అయన ఆరోగ్య పరిస్థితిపై అరా తీశారు. గత ఏడాది సెప్టెంబర్ లో వినాయక చవితి రోజున జరిగిన బైక్ యాక్సిడెంట్ లో సాయి ధరమ్ తీవ్రంగా గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. దీపావళి రోజున ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్  అయి ఇంటికి చేరుకున్నారు. అప్పటినుంచి ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు.

నేడు హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి సాయంత్రం సాయి ధరమ్ ను కలుసుకొని ప్రమాద వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా మళ్ళీ షూటింగ్ లో పాల్గొని విజయాలు సాధించాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు,. కిషన్ రెడికి సాయి ధరమ్ ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్