Sunday, November 24, 2024
HomeTrending NewsNutrition kits: ఈ నెలాఖరు లోగా న్యూట్రిషన్ కిట్లు

Nutrition kits: ఈ నెలాఖరు లోగా న్యూట్రిషన్ కిట్లు

కేంద్రం నిధులు ఇవ్వకున్నా, సీఎం కేసీఆర్ 8మెడికల్ కాలేజీలు ప్రారంబించారని, ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ప్రతి నియోజక వర్గానికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రికి  మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డిలు ఈ రోజు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… మారు మూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు.

రాబోయే రోజుల్లో 500 వరకు బస్తి దవాఖానల సంఖ్య పెరుగుతుందని మంత్రి ప్రకటించారు. ఊరూరా పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. ఏప్రిల్ చివరి లోపు రాష్ట్రం అంతటా న్యూట్రిషన్ కిట్లు అందిస్తామన్నారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకున్నా చూస్తూ కూర్చోలేదు. చేతల్లో చూపెట్టామన్నారు. రాష్ట్ర సొంత నిధులతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని ప్రకటించి, సిఎం అమలు చేస్తున్నారని, తెలంగాణ వస్తే ఏం వచ్చిందనే వారికి, మీ కండ్ల ముందే జరుగుతున్న అభివృద్ధే సమాధానం అన్నారు. మారుమూల ప్రాంతాలు సైతం కొత్త జిల్లాలు కాగా, ఆ కొత్త జిల్లాలకు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు వచ్చాయన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, నాగర్ కర్నూల్ వంటి మారుమూల జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభం అవుతాయని కలలో అయినా అనుకున్నామా..తెలంగాణ రాక ముందు సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్నా, వైద్య విద్య అన్నా.. తెలంగాణ ప్రజలకు అందని ద్రాక్షగా ఉండేదన్నారు. వైద్యం కోసం జిల్లాలు దాటి హైదరాబాద్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి. ఇక వైద్య విద్య కోసం దేశాలు దాటాల్సిన దుస్థితి అని గుర్తు చేశారు.
గతేడాది ఒకేసారి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోగా, ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకునే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.  2014కు ముందు తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, 2022 నాటికి 46కు చేరుకున్నాయి. ఈ ఏడాది 9 కలుపుకుంటే మొత్తం 55కు సంఖ్య చేరుతుందన్నారు. 65 ఏండ్లలో 20 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏండ్లలో 35 మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగిందని, మెడికల్ సీట్లు నాడు 2950 ఉంటే, ఇప్పుడు 7090కి పెరిగింది. ఈ ఏడాది 9 కాలేజీల్లో సీట్లు కలుపుకుంటే 7990 అవుతాయని మంత్రి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్