Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ప్రొ. కబడ్డీ: ప్లే ఆఫ్స్ కు యూపీ,ఢిల్లీ

ప్రొ. కబడ్డీ: ప్లే ఆఫ్స్ కు యూపీ,ఢిల్లీ

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో యూ ముంబాపై యూపీ యోధ; హర్యానా స్టీలర్స్ పై బెంగుళూరు బుల్స్;  పాట్నా పైరేట్స్ పై దబాంగ్ ఢిల్లీ విజయం సాధించాయి.

యూపీ యోధ- యూ ముంబా  జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో 35-28తో యూపీ ఘన విజయం సాధించింది. ఆట తొలి భాగంలో యూపీ 18-12తో ఆధిక్యం సంపాదించింది.  రెండో భాగంలో ముంబై రాణించినా  యూపీ 17-16 తో ఒక పాయింట్ పైచేయి పొందింది. మ్యాచ్ ముగిసే నాటికి 7 పాయింట్ల తేడాతో విక్టరీ సొంతం చేసుకుంది.

బెంగుళూరు బుల్స్ – హర్యానా స్టీలర్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 46-24 తో బెంగుళూరు దుమ్ము రేపింది. ప్రథమార్ధంలో 20-14 ఆధిక్యం ప్రదర్శించిన బెంగుళూరు ద్వితీయార్ధంలో మరింత దూకుడుగా ఆది 26-10తో సత్తా చాటింది. మ్యాచ్ ముగిసే నాటికి 22 పాయింట్ల తేడాతో గెలుపొందింది. బెంగుళూరు కెప్టెన్ పవన్ షెరావత్ 20 పాయింట్లతో రాణించి మరోసారి తన పవర్ ఆట తీరు కనబరిచాడు.

దబాంగ్ ఢిల్లీ – పాట్నా పైరేట్స్ జట్ల మధ్య పోటాపోటీగా జరిగిన మూడో మ్యాచ్ లో 26-23తో బెంగుళూరు దుమ్ము రేపింది. ఆట మొదటి సగభాగంలో 14-12 తో పైచేయి సాధించిన ఢిల్లీ మలిభాగంలో కూడా 12-11తో ఒక పాయింట్ ఆధిక్యం పొందింది. ప్రదర్శించిన మ్యాచ్ ముగిసే నాటికి 22 పాయింట్ల తేడాతో గెలుపొందింది.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… పాట్నా పైరేట్స్ (80 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (70); యూపీ యోధ (68); బెంగుళూరు బుల్స్ (66);  హర్యానా స్టీలర్స్(63); జైపూర్ పింక్ పాంథర్స్ (62) టాప్ సిక్స్ లో ఉన్నాయి.  ఇప్పటికే పాట్నా ప్లే ఆఫ్స్ కు చేరుకోగా  నేటి విజయాలతో ఢిల్లీ, యూపీ కూడా తర్వాతి రౌండ్ కు అర్హత సంపాదించాయి.

Also Read : ప్రొ కబడ్డీ: బెంగాల్, జైపూర్ భారీ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్