Mahesh- Upendra: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో ‘సర్కారు వారి పాట’ చేస్తున్నారు. ఈ భారీ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. మహేష్ సరసన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఈ సినిమా తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోకు సమానమైన పాత్ర ఉందని.. ఆ పాత్రను ఎవరితో చేయించనున్నారనేది ఇంకా ఫైనల్ కాలేదని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను ఈ సినిమా కోసం ఫైనల్ చేసారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఉపేంద్ర.. మహేష్ కి అన్నయ్య పాత్ర పోషిస్తున్నారట. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్ గా.. ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా ఉంటాయని అంటున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి.. మహేష్, త్రివిక్రమ్ కలిసి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.
Also Read : ప్రవీణ్ సత్తారు డైరక్షన్‌లో వరుణ్ తేజ్