Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్ బదులు చరణ్ తో బుచ్చిబాబు?

ఎన్టీఆర్ బదులు చరణ్ తో బుచ్చిబాబు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్, ఏజే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో చరణ్‌ రెండు భిన్నమైన పాత్రలు పోషిస్తుండడం విశేషం. శంకర్ తెలుగులో చేస్తున్న ఫస్ట్ స్ట్రైయిట్ మూవీ కావడంతో ఈ భారీ పాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా తర్వాత చరణ్‌ గౌతమ్ తిన్నూరితో సినిమా చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. అప్పటి నుంచి చరణ్ శంకర్ తో చేస్తున్న మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. వేణు శ్రీరామ్, కన్నడ డైరెక్టర్ నర్తన్ పేరు వినిపించింది. తాజాగా ఎన్టీఆర్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా ఎన్టీఆర్ డైరెక్టర్ అంటారా..? ఉప్పెన సినిమాతో తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ సాధించిన బుచ్చిబాబు. ఉప్పెన రిలీజ్ తర్వాత నుంచి నెక్ట్స్ మూవీని ఎన్టీఆర్ తో చేయాలని కథ పై కసరత్తు చేస్తున్నాడు.

అయితే.. ఎన్టీఆర్ కొరటాల శివతో చేయనున్న సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది కానీ.. సెట్స్ పైకి వెళ్లలేదు. త్వరలో ఈ భారీ పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబుతో సినిమా అంటే… ఇంకా ఆలస్యం అవుతుంది కాబట్టి బుచ్చిబాబు రీసెంట్ గా చరణ్ కి కథ చెప్పాడట. కథ విని చరణ్ పాజిటివ్ గా స్పందించారని సమాచారం. త్వరలోనే ఫుల్ నెరేషన్ ఇవ్వనున్నాడు. దీంతో బుచ్చిబాబు నెక్ట్స్ మూవీ ఎన్టీఆర్ తో ఉంటుందా..?  చరణ్ తో ఉంటుందా..? అనేది ఆసక్తిగా మారింది.

Also Read : ఆ స్టార్ హీరో బుచ్చిబాబుకు నో చెప్పాడా..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్