Sunday, January 19, 2025
Homeసినిమారామ్,బోయపాటి మూవీ లో బాలీవుడ్ బ్యూటీ

రామ్,బోయపాటి మూవీ లో బాలీవుడ్ బ్యూటీ

రామ్ తో బోయపాటి మూవీని చేస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇటీవల ఈ మూవీ సెట్స్ పైకి వచ్చింది. రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఎంతో గ్రాండ్ లెవెల్లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి మంచి క్రేజ్ ఏర్పడింది. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈసారి బోయపాటి ఎలాంటి కథతో సినిమా చేస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది. అఖండలో ఈశ్వరుడు గురించి ప్రస్తావన వచ్చినట్లే… రామ్ మూవీలో కేరళ నేపధ్యంలో అయ్యప్ప స్వామి ప్రస్తావన ఉంటుందని.. ఇంకా చెప్పాలంటే రామ్ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఏంటంటే… ఈ మూవీలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

చాలా మంది బాలీవుడ్ బ్యూటీస్ ని అనుకున్నప్పటికీ ఫైనల్ గా ఊర్వశి రౌటేలాను ఎంపిక చేశారు. ఈ సినిమాలో ఈ సాంగ్ అదిరిపోతుందని అలానే ఈ సాంగ్ కి థమన్ సూపర్ ట్యూన్ అందించారని సమాచారం. న్యూయర్ కి, సంక్రాంతికి ఈ మూవీ నుంచి అప్ డేట్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి.. రామ్ ఎప్పటి నుంచో ఆశిస్తున్న బ్లాక్ బస్టర్ ను బోయపాటి అందిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్