Sunday, January 19, 2025
HomeTrending Newsఉత్తరాఖండ్ సిఎంగా దామి ప్రమాణ స్వీకారం

ఉత్తరాఖండ్ సిఎంగా దామి ప్రమాణ స్వీకారం

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ దామి రెండోసారి ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడున్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆశేష జనసందోహం మధ్య గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ దామితో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా ఎనిమిది మంత్రి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ 11 వ ముఖ్యమంత్రిగా దామి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర రోడ్లు రహదారులు, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కారి, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డ, కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు హాజరయ్యారు.

ఉత్తరాఖండ్ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి, వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఉదంసింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా స్థానంలో పుష్కర్ సింగ్ ధామి ఓటమి పాలయ్యారు. ఖతిమా స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6,579 ఓట్ల తేడాతో ఓడిపోయిన పుష్కర్ సింగ్ ధామి మార్చి 11న ఉత్తరాఖండ్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

ఎమ్మెల్యేలు సత్పాల్ మహారాజ్, ప్రేమచంద్ అగర్వాల్,గణేష్ జోషి,డాక్టర్ ధన్ సింగ్ రావత్, శ్రీ భో  దునియాల్, రేఖ ఆర్య, చందన్ రాందాస్, సౌరబ్ బహుగుణలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా సౌరబ్ బహుగుణ మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ కుమారుడు కావటం గమనార్హం.

Also Read : మణిపూర్ సిఎంగా బిరెన్ సింగ్ ప్రమాణ స్వీకారం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్