Sunday, January 19, 2025
HomeTrending Newsయుపీలో ఆరో విడత పోలింగ్ ప్రారంభం

యుపీలో ఆరో విడత పోలింగ్ ప్రారంభం

దేశ వ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ కొద్ది సేపటి కింద ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ లో తన వోటు హక్కు వినియోగించుకున్నారు.  ఏడు విడతల పోలింగ్ లో భాగంగా చివరి రెండు విడతలు కీలకమైన పూర్వాంచల్ లో జరుగుతున్నాయి. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలకు..ఇప్పటికే 292 సీట్లకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది.

పూర్వాంచల్ లో మొత్తం 111 స్థానాలు  ఉండగా ఆరో విడతలో 57 స్థానాల్లో ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఆరో విడత ఎన్నికల్లో 57 స్థానాలకు 676 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అంబేడ్కర్ నగర్, బలరాంపుర్, సిద్ధార్థ్​నగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, మహారాజ్ గంజ్, గోరఖ్​పుర్, ఖుషీనగర్, దేవరియా, బలియా జిల్లాలపరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి,సిఎం యోగి కంచుకోట గోరఖ్​పుర్ లోక్​సభ స్థానాల్లోని నియోజకవర్గాలకు ఈ దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇప్పటి వరకు బీజేపీ – ఎస్పీ పార్టీలు హోరా హోరీ గా తలపడినా.. ఈ దఫా బిజెపి మిత్ర పక్షాలు అప్నాదల్, నిషాద్ పార్టీ లు కీలక భూమిక పోషించనున్నాయి. బిజెపి మిత్ర పక్షాలు  సాధించే సీట్ల సంఖ్యతో కమలనాథుల భవితవ్యం ఆధారపడి ఉంది. భాజపా మిత్రపక్షాలైన అప్నాదళ్, నిషాద్​.. ఇక్కడే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. పూర్వాంచల్​లో భాజపా మెరుగ్గా రాణించాలంటే ఈ రెండు పార్టీలు అధిక సీట్లను గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రెండు పార్టీలకు భాజపా అధిక ప్రాధాన్యాన్ని ఇస్తోంది. 2017లో అప్నాదళ్​కు 11 సీట్లే కేటాయించిన భాజపా.. ఇప్పుడు 17 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది. నిషాద్ పార్టీ 16 స్థానాల్లో బరిలోకి దిగింది.

Also Read : యుపి ఐదో దశ ప్రశాంతం

RELATED ARTICLES

Most Popular

న్యూస్