Saturday, March 7, 2026
Homeసినిమాఅనుష్కతో యు.వి.క్రియేషన్స్ మూడో సినిమా

అనుష్కతో యు.వి.క్రియేషన్స్ మూడో సినిమా

UV Creations To Produce A Movie Anushka In Lead Role :

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ చేశారు ప్రతిష్ఠాత్మక  నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్. సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్ కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నారు. ఇది అనుష్కకు 48వ సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేశారు అనుష్క.

2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘మిర్చి’ 2018లో  లేడీ ఓరియెంటెడ్ ‘భాగమతి’ సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. భాగమతి సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఒకేసారి విడుదలై అద్భుతమైన విజయం అందుకుంది. ఇందులో తనదైన నటనతో అందరినీ మెప్పించారు అనుష్క. ఇప్పుడు మూడోసారి అనుష్క యు.వి.క్రియేషన్స్ కలిసి సినిమా చేయబోతున్నారు. దర్శకుడు మహేష్ బాబు న్యూ ఇమేజ్ ఎంటర్ టైన‌ర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

అనుష్క అభిమానులకు ఇది నిజంగా బర్త్ డే సర్ ప్రైజ్. ఏ మాత్రం హడావిడి లేకుండా ఉన్నట్టుండి ఆమె కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు అనుష్క. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే దీని పై దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. భాగమతి సినిమా తెలుగుతో పాటు సౌతిండియన్ భాషల్లో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాను కూడా యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు అన్ని భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎవరెవరు నటించబోతున్నారు అనే విషయం పై చిత్ర యూనిట్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి: 

అందం, అభినయం, అణుకువ…. అనుష్క

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular