Saturday, January 18, 2025
Homeసినిమాఅత్తగారింటి రహస్యాలను ఛేదించే 'వధువు' 

అత్తగారింటి రహస్యాలను ఛేదించే ‘వధువు’ 

సాధారణంగా అత్తగారింట్లో అడుగుపెట్టిన కొత్త కోడలికి కొన్ని ఆంక్షలు ఎదురవుతూ వుంటాయి. గతంలో తమ కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలు కొత్త కోడలికి తెలియకుండా అత్తగారు జాగ్రత్తపడుతూ ఉంటుంది. అలా తెలిస్తే తామంతా చులకన అవుతామని ఆమె భావిస్తూ ఉంటుంది. ఇక అప్పటి వరకూ ఆడపిల్లలు ఒక వాతావరణంలో పెరుగుతారు. అత్తవారింటికి వచ్చాక ఇక్కడి ఆచారాలు.. వ్యవహారాలు కొత్త కోడలిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి ఒక కొత్త కోడలి కథనే ‘వధువు’. హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.

అవికా గోర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ కి, పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు. సాధారణంగా ఆడపిల్లలు సాధ్యమైనంతవరకూ తమ తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఉంటారు. వాళ్ల భారాన్ని తగ్గించడానికి పెళ్లి విషయంలోను సర్దుకుపోతుంటారు. తన విషయంలో తన చెల్లెలు చేసిన తప్పు కారణంగా, సంబంధాలు గుమ్మం వరకూ వచ్చి పోతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో కొన్ని విషయాల పట్ల ‘ఇందు’ రాజీ పడుతూ, ధనవంతుల కుటుంబానికి కోడలిగా వెళుతుంది.

అత్తగారింట్లో అడుగుపెట్టిన ఆమెకి, ఆచారాలు .. సంప్రదాయాల పేరుతో ఇబ్బంది ఎదురవుతుంది. భర్తతో పాటు, ఆ ఇంట్లోని పాత్రలన్నీ కూడా చిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. తనకి తెలియంది ఆ ఇంట్లో ఇంతకు ముందు ఏదో జరిగింది. తనకి తెలియకుండా ఇప్పుడు కూడా ఏదో జరుగుతోంది? అనే విషయం ‘ఇందు’కు అర్థమవుతుంది. ఆ రహస్యాలను ఛేదించి తన కాపురాన్ని నిలబెట్టుకోవాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం చేసే ప్రయత్నాలలో ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనేదే కథ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్