మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలంతా ఎవరి ప్రత్యేకతను వారు చాటుకుంటూ కెరియర్ ను నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఏ మాత్రం కంటెంట్ లో విషయం ఉన్నా తమ టాలెంట్ తో ఆ సినిమాను వాళ్లు నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతున్నారు. అలా సాయిధరమ్ తేజ్ తరువాత ఆయన తమ్ముడైన వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు. మాస్ లుక్ తో సినిమా విడుదలకి ముందే మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఆ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను సంపాదించి పెట్టేసింది.
ఆ సినిమా హిట్ ను ఒక రేంజ్ లో ఆస్వాదించాలని వైష్ణవ్ అనుకుంటే, అంతకుముందే ఆయన చేసిన ‘కొండ పొలం’ సినిమా థియేటర్లకు వచ్చింది. ఒక నవల ఆధారంగా చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఆ సినిమా, ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ తరువాత అతను చేసిన సినిమానే ‘రంగ రంగ వైభవంగా‘. తెలుగులో గిరీశాయ తొలిసారిగా రూపొందించిన సినిమా ఇది. వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. పవన్ పుట్టిన రోజున ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం ప్రత్యేకతను సంతరించుకుంది.
‘కొండ పొలం’తో నిరాశపరిచిన వైష్ణవ్, ఈ సినిమాతో పైకి లేవాల్సిందే. తానేమిటనేది నిరూపించుకోవాలసిన సినిమా ఇది. ఈ సినిమా హిట్ అయితే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చేరువవుతాడు. అందువలన ఈ సినిమా సక్సెస్ ను సాధించవలసిన అవసరం ఉంది. ఇక కేతిక శర్మకి కూడా ఈ సక్సెస్ చాలా ముఖ్యమైనదే. గతంలో చేసిన ‘రొమాంటిక్’ .. ‘లక్ష్య’ ఫలితాలు నిరాశపరిచాయి. ఇక్కడ ఆమె మరికొంతకాలం నిలబడాలంటే .. తెరపై కనబడాలంటే ఈ సినిమాతో ఆమె హిట్ పట్టుకోవలసిందే. ఈ సినిమా ఒకేసారి ఈ ఇద్దరి ముచ్చటా తీరుస్తుందేమో చూడాలి మరి.
Also Read : ‘రంగ రంగ వైభవంగా’ సెప్టెంబర్ 2న గ్రాండ్ రిలీజ్