Special Glimpse: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా పై ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా విడుదల కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా స్పెషల్ గ్లింప్స్ విడుదల చేసారు మేకర్స్. దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాన్స్ చాలా బాగుంది. మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు నిర్మాతలు. ట్రైలర్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్ కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. మరి.. రాధేశ్యామ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read : విడుదల తేదీలు ఖరారు: రాధే శ్యామ్ మార్చి 11న?