Sunday, January 19, 2025
Homeసినిమాప్ర‌భాస్ 25వ చిత్రం ‘స్పిరిట్’ : ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి

ప్ర‌భాస్ 25వ చిత్రం ‘స్పిరిట్’ : ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించ‌నున్న 25వ చిత్రం గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈరోజు ప్ర‌భాస్ 25వ చిత్రాన్ని ప్ర‌క‌టిస్తార‌ని చెప్పిన‌ప్ప‌టి నుంచి ఆ సినిమా ఏ స్దాయిలో ఉండ‌బోతుంది..? ద‌ర్శ‌కుడు ఎవ‌రు..?   నిర్మాత ఎవ‌రు..? ఇలా అనేక ప్ర‌శ్న‌లు. ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లు అన్నింటికి స‌మాధానం దొరికింది. ప్ర‌భాస్ 25వ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారని అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు. ఈ చిత్రాన్ని టీ-సీరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకం పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ భారీ పాన్ ఇండియా మూవీని 8 భాషల్లో తెరకెక్కించ‌నున్నారు. ప్రస్తుతం రాధే శ్యామ్, ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే చిత్రాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు స‌మాచారం. మ‌రి.. ఈ సినిమాతో ప్ర‌భాస్ – సందీప్ ఏ రేంజ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్