Saturday, January 18, 2025
HomeసినిమాVanga: సందీప్ రెడ్డి నెక్ట్స్ మూవీ ఎవరితో?

Vanga: సందీప్ రెడ్డి నెక్ట్స్ మూవీ ఎవరితో?

‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం యానిమల్ మూవీ చేస్తున్నాడు.  ప్రభాస్ తో స్పిరిట్  మూవీకి రంగం సిద్ధం చేసుకున్నాడు. ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ‘ఆదిపురుష్’ గత నెలలో విడుదల కాగా,  సెప్టెంబర్ 28న సలార్ రాబోతోంది.  ప్రస్తుతం మారుతితో చేస్తున్న మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. సలార్ తర్వాత కల్కి సినిమాతో రానున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందుతోన్న కల్కి మూవీ పాన్ వరల్డ్ గా రానుంది.

సందీప్ రెడ్డి ‘యూనిమల్’ ను ఆగష్టు 11న విడుదల చేయాలనుకున్నారు కానీ.. డిసెంబర్ కి వాయిదా వేశారు. టీజర్ రిలీజ్ చేశారు. ఇది డిఫరెంట్ గా ఉండడంతో సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా  సినిమా  చేస్తున్నట్లు సందీప్ ప్రకటించాడు. బన్నీని సరికొత్తగా చూపిస్తాడని.. ఇప్పటి వరకు రాని ఓ కొత్త కథాంశంతో ఈ సినిమా ఉంటుందని టాక్ వచ్చింది.

సందీప్ రెడ్డి తర్వాతా మూవీ ప్రభాస్ తోనా  అల్లు అర్జున్ తోనా అనేది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ తోనే అని తెలిసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ తో అని టాక్ వస్తుంది కానీ…  చివరకు సందీప్  తోనే  చేసే ఛాన్స్ ఉందని  అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్