Varsha Bollamma: డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పతాకంపై ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా `స్టాండ్ ఆప్ రాహుల్’…. ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్‌లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాను నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు, పాటలకు ప్రేక్షకులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 18న విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర హీరోయిన్ వర్ష బొల్లమ్మ విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…
“కూర్గ్ లో పుట్టిన నేను బెంగుళూరులో చదువు పూర్తి చేసుకున్నాను. మా ఫ్యామిలీలో ఎవరూ సినిమాలో నటించలేదు. మా అమ్మ నాన్నలకు ఇండస్ట్రీ విషయాలు ఏమీ తెలియవు. నేను ఫస్ట్ “చూసి చూడంగానే ” సినిమా స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు నాకు తెలుగు రాక చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఆ తరువాత తెలుగులో మాట్లాడుతూ తెలుగు నేర్చుకున్నాను. ఆ తరువాత నేను చేసిన సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను”
“నాకు ఏ మూవీ అయినా స్క్రీన్ స్పేస్ ఎక్కువ లేకున్నా స్ట్రాంగ్ క్యారెక్టర్ వుండే కథలు నాకిష్టం. ఈ మూవీలో స్ట్రాంగ్ క్యారెక్టర్ తో పాటు స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగా వుంది. అమ్మాయిలకు రిలేట్ అయ్యే మంచి కథ ఉన్నందున ఈ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రంలో నేను శ్రేయారావుగా విభిన్న పాత్రలో నటిస్తున్నాను. ఇందులో హీరో క్యారెక్టర్ కు సమానంగా నా క్యారెక్టర్ ఉంటుంది. సాధారణంగా ప్రతి అమ్మాయికి కొన్ని కలలు ఉన్నట్లే ఇందులో శ్రేయారావు కు వుండే కలలు తో పాటు తన పార్టనర్ కలకోసం నిలబడే అమ్మాయి పాత్రలో నటిస్తున్నాను”
“నేను నా ఫ్రెండ్స్ తో ఎంతో హుషారుగా ఫుల్ జోకులు వేసుకుంటూ, హైపర్ యాక్టివ్ గా ఉండేదాన్ని. అయితే రాజ్ తరుణ్ షూటింగ్ సెట్లో ఎప్పుడూ జోక్స్ చెపుతూ.. ఎంతో ఎనర్జిటిక్ గా ఉండడం చూసి నన్ను నేను చేసుకున్నట్లు అనిపించింది. షూటింగ్ లో కూడా తనతో చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యాను. కోవిడ్ టైం లో ప్రేక్షకులందరూ థియేటర్స్ వెళ్లడానికే బయపడేవారు. అయితే.. ఈ మధ్య కోవిడ్ తగ్గుముఖం పట్టడం అలాగే.. ఈ మధ్య పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తున్నారు. అయితే.. మా సినిమా చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూ బయటికి వచ్చేలా మా సినిమా ఉంటుంది“
నా ఫ్రెండ్స్ తో ‘నేను స్టాండ్ ఆప్ రాహుల్’ సినిమాలో చేస్తున్నానని చెప్పగానే అందరూ కూడా నేనే స్టాండ్ ఆప్ కామెడీ చేస్తున్నానని అనుకున్నారు. కానీ ఈ సినిమాలో పూర్తిగా కామెడీ చేసే చాన్స్ రాకపోయినా కొంతవరకు వరకు మాత్రం నా కామెడీతో ప్రేక్షకులు నవ్వుకుంటారు. దర్శక నిర్మాతలు నాకు చాలా ఫ్రీడమ్ ఇవ్వడంతో ఈజీ గా నటించ గలిగాను. అయితే వెన్నెల కిషోర్ గారు స్పాంటేనియస్ గా వర్క్ చేసే వారు… ఆయనతో చేసే సన్నివేశాలు చేయడం కష్టం అనిపించింది. కిషోర్ సర్, రాజ్ తరుణ్ ల దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను”
“నాకు వర్క్ షాప్ చేయడమంటే చాలా ఇష్టం. ఈ సినిమాకే కాకుండా నేను హీరోయిన్ గా నటించిన “చూసీ చూడంగానే,” “మిడిల్ క్లాస్ మెలోడీస్” సినిమాలకు కూడా వర్క్ షాప్ చేశాను. అయితే విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమాకు వర్క్ చేసింది తక్కువ రోజులే అయినా కూడా మూడు నెలలు ఫుట్ బాల్ నేర్చుకుని యాక్ట్ చేయడం జరిగింది.. అలా చేయడం వలన చాలా ఈజీగా నటించగలిగాను. నాకు అన్ని రకాల సినిమాలు చెయ్యాలని ఉంది కానీ సెలెక్టెడ్ సినిమాలే వస్తున్నాయి. ప్రస్తుతం సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ‘స్వాతి ముత్యం’ సినిమా చేస్తున్నాను. అలాగే ఇంకొక మూవీ కూడా చేస్తున్నాను” అని వెల్లడించింది.