Sunday, January 19, 2025
Homeసినిమాగ‌ని ఫ్లాప్ అని ఒప్పుకున్న వ‌రుణ్‌

గ‌ని ఫ్లాప్ అని ఒప్పుకున్న వ‌రుణ్‌

Varun emotion: మెగా హీరో వ‌రుణ్ తేజ్ హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి తెర‌కెక్కించిన చిత్రం గ‌ని. ఈ చిత్రాన్ని అల్లు బాబి, సిద్ధూ ముద్ద సంయుక్తంగా నిర్మించారు. ఇటీవ‌ల గ‌ని సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా ఆడియ‌న్స్ ని ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ ను షేర్ చేయడం జరిగింది.

ఇంత కాలంగా మీ ప్రేమను .. ఎఫెక్షన్ ను నా పై చూపించినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. గని మేకింగ్ లో పాలుపంచుకున్న వారందరికీ  థ్యాంక్స్ చెబుతున్నాను. ఎంతో ఫ్యాషన్ తో ఈ సినిమా కోసం హార్డ్ వర్క్ చేశాం కానీ..  ఎక్కడో మా ఐడియా మేము అనుకున్నట్టుగా రీచ్ కాలేదు. నేను  ఎప్పుడూ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయాలనే అనుకుంటాను. ఆ ప్రయత్నంలో కొన్ని సార్లు నేను సక్సెస్ అవుతాను. కొన్ని సార్లు నేర్చుకుంటాను కానీ.. కష్టపడం మాత్రం ఎప్పటికీ ఆపను అని తెలియ‌చేశారు.

Also Read : ‘గ‌ని’ చూశాను… చాలా బాగుంది : అల్లు అర్జున్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్