Saturday, January 18, 2025
Homeసినిమావరుణ్ సందేశ్ కొత్త‌ చిత్రం ప్రారంభం

వరుణ్ సందేశ్ కొత్త‌ చిత్రం ప్రారంభం

బి. యం. సినిమాస్ పతాకంపై వరుణ్ సందేశ్ , సీతల్ భట్ జంటగా ఆర్. యన్. హర్ష వర్ధన్ దర్శకత్వంలో ఓ వైవిధ్య‌మైన చిత్రం ప్రారంభమైంది. శేషు మారం రెడ్డి, బోయపాటి భాగ్య లక్ష్మి సమర్పణలో “ప్రొడక్షన్ నెంబర్ 1 ” గా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ సాయిబాబా దేవాలయంలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దామోదర్ ప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా,మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూబ “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరి పెద్దలకు ధన్యవాదములు. దర్శకుడు హర్షవర్ధన్ చెప్పిన కథ విన్న తరువాత నాకు 100% సక్సెస్ ఫుల్ సినిమా అవుతుందని అనిపిస్తుంది. ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ గా వస్తున్న“ఈ మూవీ లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా నాకు చాలా మంచి సినిమా అవుతుంది” అన్నారు.

Also Read : ఆక‌ట్టుకుంటున్న వరుణ్ సందేశ్ ‘యద్భావం తద్భవతి’ ఫస్ట్ లుక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్