Sunday, January 19, 2025
Homeసినిమావరుణ్ తేజ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..?

వరుణ్ తేజ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..?

వరుణ్ తేజ్, లావణ్య ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఎంగేజ్ మెంట్ చేసుకోవడం తెలిసిందే. వీరిద్దరూ లవ్ లో ఉన్నారని బయటకు లీక్ కాకుండా చాలా జాగ్రత్తపడ్డారు. ఎంగేజ్ మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. గత నెల 9న నాగబాబు ఇంట్లో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ ఇయర్ లోనే మ్యారేజ్ ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ.. ఎప్పుడు అనేది ప్రకటించలేదు. ఇప్పుడు వరుణ్, లావణ్యల మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది.

ఇంతకీ విషయం ఏంటంటే… ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుక‌లు ముగిసిన‌ రెండు రోజులకు అంటే ఆగస్ట్ 24న మెగా వెడ్డింగ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారట. ఇంతకీ పెళ్లి ఎక్కడా అంటే.. ఇటలీలో అని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి లవ్ లో పడింది అక్కడే అట. అందుకనే ఇటలీలోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. వరుణ్‌, లావణ్య మిస్టర్, అంతరిక్షం 9000 KMPH చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి లవ్ లో ఉన్న వీరిద్దరూ ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. త్వరలోనే మ్యారేజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటిస్తారట.

వరుణ్ తేజ్ ప్రస్తుతం గాంఢీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోందట. ఈ మూవీ స్టిల్స్, మేకింగ్ వీడియో చూస్తుంటే.. సరికొత్త యాక్షన్ ని చూపించబోతున్నారనిపిస్తుంది. ఆమధ్య గని అనే సినిమా కోసం చాలా కష్టపడ్డాడు కానీ.. వర్కవుట్ కాలేదు. ఈసారి ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలి అనుకుంటున్నాడు. విశేషం ఏంటంటే.. పెళ్లి చేసుకున్న నెక్ట్స్ డే అంటే ఆగష్టు 25న గాంఢీవధారి అర్జున విడుదల కానుంది. మరి.. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్