Sunday, September 8, 2024
HomeసినిమాDecember Release: వరుణ్, నానితో పోటీకి సై అంటున్న నితిన్..?

December Release: వరుణ్, నానితో పోటీకి సై అంటున్న నితిన్..?

వరుణ్‌ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్టర్. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ 50 కోట్లు వచ్చిందని టాక్. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. వరుణ్ తేజ్ నటించిన గని, గాంఢీవధారి అర్జున చిత్రాలు ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. దీంతో వరుణ్ ఇప్పుడు ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. ఇలాంటి టైమ్ లో ఆపరేషన్ వాలెంటైన్ మూవీని డిసెంబర్ 8న విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. నాని నటిస్తున్న మూవీ ‘హాయ్ నాన్న’. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శౌర్యవ్ డైరెక్టర్. ఇందులో నానికి జంటగా సీతారామమ్ ఫేమ్ మృణాల్ ఠాగూర్ నటిస్తుంది. ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయాలి అనుకున్నారు. అయితే.. సలార్ వస్తుండడంతో హాయ్ నాన్న చిత్రాన్ని కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు వరుణ్, నాని మధ్య పోటీ ఏర్పడింది.

అయితే.. ఇప్పుడు వరుణ్, నానితో పోటీకి నితిన్ సై అంటున్నాడని తెలిసింది. నితిన్ ‘ఎక్స్ ట్రా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఆర్డినరీ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల ఈ మూవీ నుంచి డేంజర్ పిల్లా అంటూ ఓ సాంగ్ రిలీజ్ చేశారు. దీనికి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలాఖరున విడుల చేయాలి అనుకున్నారు కానీ.. సలార్ వస్తుండడంతో ఈ చిత్రాన్ని డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. దీంతో వరుణ్, నాని, నితిన్.. సినిమాల మధ్య పోటీ ఏర్పడింది. మరి.. ఈ పోటీలో ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్