వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కు జంటగా సాక్షి వైద్య నటిస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ టీజర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ ఏజెంట్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో నాజర్ ని ఎందుకు టార్గెట్ చేశారు..? సాక్షి వైద్య వరుణ్ తేజ్ తో వర్క్ చేయడానికి ఎందుకు నిరాకరిస్తుంది..? అనేది ఇంట్రస్ట్ కలిగిస్తోంది.
మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ అనేలా ఉన్నాయి. మొత్తానికి గాంఢీవధారి అర్జున టీజర్ సినిమా పై ఆడియన్స్ లో మరింతగా ఆసక్తిని పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుణ్ తేజ్ ఆమధ్య గని అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ.. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు వరుణ్ తేజ్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆగష్టు 25న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.