Saturday, November 23, 2024
HomeTrending Newsకొత్త పోకడలపై దృష్టి పెట్టాలి : వాసిరెడ్డి పద్మ

కొత్త పోకడలపై దృష్టి పెట్టాలి : వాసిరెడ్డి పద్మ

మహిళల అక్రమ రవాణా, లైంగిక అణచివేతలో అక్రమార్కులు ఆధునిక పద్దతులను ఉపయోగిస్తున్నారని, వీటిపై దర్యాప్తు సంస్థలు సమగ్ర దృష్టి సారించాలని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. ‘మహిళల అక్రమ రవాణా- లైంగిక అణచివేత – ఆన్ లైన్ భద్రత’ అనే అంశంపై ఆగస్టు 17 నుండి 19 వరకు 3 రోజులు పాటు మేరీ స్టెల్లా కాలేజీ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ ఇంటర్నేషనల్ వెబినార్ ను ఆమె ఈరోజు ప్రారంభించారు.  అమెరికా, ఆఫ్రికా, ఫిలిప్పీన్స్, నేపాల్, పాకిస్థాన్, వియాత్నం, ఇటలీ దేశాలతో పాటు భారతదేశంలోని 13 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ వెబినార్ లో వాసిరెడ్డి పద్మ ప్రారంభోపన్యాసం చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మహిళల అక్రమ రవాణా నిరోధించటానికి ప్రతిజిల్లాలో ప్రత్యేక యూనిట్ల ను ఏర్పాటు చేసి పోలీస్ అధికారులను నియమించిందని పేర్కొన్నారు.  రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ వంటి సంస్థల తో కలిపి యూనివర్సిటీల్లో, కాలేజిల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్ లను ఏర్పాటు చేసిందని, అవగాహనా సదస్సు లు నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

ఆన్లైన్ ద్వారా అమాయక యువతులపై వల విసురుతున్న కేటుగాళ్ళ గురించి స్కూల్ స్థాయి వరకు బాలికలకు, విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటోందని పద్మ పేర్కొన్నారు.  ఆన్లైన్ ద్వారా,  ఇతర నూతన పద్ధతులను ఉపయోగించి అక్రమ రవాణా ముఠాలు మహిళలను దొంగ దెబ్బ తీస్తున్నాయని పద్మ ఆవేదన వ్యక్తం చేశారు.  అనేకమంది ప్రముఖులు కూడా ఈ వెబినార్ లో పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు తెలియచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్