Saturday, January 18, 2025
Homeసినిమాఅంద‌రికీ షాక్ ఇచ్చిన డైరెక్ట‌ర్ వశిష్ట

అంద‌రికీ షాక్ ఇచ్చిన డైరెక్ట‌ర్ వశిష్ట

కల్యాణ్ రామ్ డ్యుయెల్ రోల్ లో నటించిన ‘బంబిసార‌’. ఈ సినిమాతో వశిష్ట దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతో ఎవరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఎన్టీఆర్ సైతం దర్శకుడు వశిష్ట టేకింగ్ మేకింగ్ ల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో వశిష్ట టాలీవుడ్ లో హాట్ ఫేవరేట్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు.

బింబిసార తరువాత ఈ మూవీకి సీక్వెల్ ని చేయబోతున్నామంటూ కల్యాణ్ రామ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే  డైరెక్టర్ వశిష్ట తాజాగా అందరికి షాకిస్తూ రజనీకాంత్ కు కథ చెప్పినట్టుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల చెన్నై వెళ్లిన వశిష్ట రజనీకాంత్ ని కలిశారట. కలవడమే కాకుండా ఆయనకు కథ వినిపించారట.

రజనీ కూడా కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని చెబుతున్నారు. రజనీకాంత్  డైరెక్టర్ నెల్సన్దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న జైలర్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇది పూర్తయ్యాక  వశిష్ట సినిమా గురించి ఆలోచిస్తారట. తను కూడా కల్యాణ్ రామ్ తో ‘బింబిసార 2’ ని పూర్తి చేయాలి. ఆ తరువాతే రజనీ ప్రాజెక్ట్ కు వెళ్లే అవకాశం వుంది. ఇదే క‌నుక జ‌రిగితే.. సంచ‌ల‌న‌మే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్