Sunday, January 19, 2025
Homeసినిమాప్రభాస్ కి కృతజ్ఞతలు తెలిపిన 'వేద' టీమ్

ప్రభాస్ కి కృతజ్ఞతలు తెలిపిన ‘వేద’ టీమ్

కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో. ప్రస్తుతం నటించిన చిత్రం ‘వేద‘. ఈ చిత్రం కి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇది అతని 125వ చిత్రం. అంతే కాకుండా అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన హోమ్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం.

ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న గురువారం తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుంది. మాములుగా ఇండస్ట్రీలో సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతుంటాయి. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్ మరియు మోషన్ పోస్టర్స్ ను ఇది వరకే ఆవిష్కరించింది చిత్ర బృందం. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న ప్రభాస్ కి ఈ చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై సంచలనం సృష్టించింది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్