Sunday, January 19, 2025
HomeసినిమాVeera Simha Reddy: 'వీరసింహారెడ్డి' వంద రోజుల సెలబ్రేషన్స్

Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ వంద రోజుల సెలబ్రేషన్స్

బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ మలినేని గోపీచంద్ తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో బాలయ్యకు జంటగా శృతి హాసన్ నటించింది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం.. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో వీరసింహారెడ్డి పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

ఈ సినిమా విడుదల అయిన తర్వాత చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇప్పుడు 100 రోజులను పూర్తి చేసుకోనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సినిమా అయినా రెండు వారాలు లేదా మూడు వారాలు ఆడుతుంది. అంతకు మించి ఆడే పరిస్థితి లేదు. అలాంటిది వీరసింహారెడ్డి చిత్రం ఎనిమిది కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ విధంగా వీరసింహారెడ్డి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా 100 డేస్ సెలబ్రేషన్స్ ను ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

వేదిక ఎక్కడనేది త్వరలో తెలియజేయనున్నారు. ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. బాలయ్య సినిమా అంటే ప్రేక్షకులు ఏం కావాలి అనుకుంటారో అవన్నీ ఉండడంతో ప్రేక్షకాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్