Sunday, January 19, 2025
Homeసినిమా'వీరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ ఎప్పుడు..? ఎక్కడ..?

‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఎప్పుడు..? ఎక్కడ..?

బాలకృష్ణ, శృతి హాసన్ ల తొలి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తుండగా కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా కనిపించనున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అన్ని వీరసింహారెడ్డి పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అవుతోన్న వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 6న ఒంగోలు లోని ఏబీఎమ్ కాలేజీ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గం. ల నుండి యూనిట్ సభ్యులు, ప్రేక్షకాభిమానుల సమక్షంలో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్నట్లుగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కి సంబంధించి ఏర్పాట్లు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి.

ఇదే వేదిక పై వీరసింహారెడ్డి ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు కలిస్తే ఎలా ఉంటుందో వీరసింహారెడ్డి అలా ఉంటుందట. ఈ విషయాన్ని డైరెక్ట్ గా డైరెక్టర్ మలినేని గోపీచంద్ చెప్పడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు. మరి… వీరసింహారెడ్డి మూవీ రిలీజ్ తరువాత ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్