Wednesday, January 22, 2025
HomeTrending Newsవీరప్పన్ వారసులు : వైసీపీ నేతలపై బండి ఫైర్

వీరప్పన్ వారసులు : వైసీపీ నేతలపై బండి ఫైర్

తిరుమల తిరుపతిలో మొన్నటి వరకు నిలువు నామాలు పెట్టుకుని ప్రజలకు పంగనామాలు పెట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అన్యమతస్తులకు పదవులిచ్చి హిందూ ధర్మంపై దాడి చేశారన్నారని, గత పాలనలో వీరప్పన్ వారసులు శేషాచల కొండల్లోని జాతీయ సంపదైన ఎర్రచందనం స్మగ్లింగ్ తో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు.  ఈ విషయాన్ని తేలిగ్గా వదిలిపెట్టబోమని, ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు మాట్లాడారని…. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  దృష్టికి తీసుకు వెళ్లి పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకుని బాద్యులపై తగిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నేడు తన పుట్టిన రోజును పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండి ఆ తర్వాత  మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం తిరుమలలో భక్తియుత, ధార్మిక వాతావరణం నెలకొందని, మొన్నటి వరకు దేవుడిని నమ్మని వాళ్లు, ధర్మం గురించి ఆలోచించని వాళ్లు … రుకు నామాలు పెట్టుకుని స్వామివారి ఆస్తులకే పంగనామాలు పెట్టారని విమర్శించారు. గత ఐదేళ్ళలో రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా తిరుమల మారిందని, పదవుల కోసం టీటీడీని వాడుకున్నారని అన్నారు. “ఆ నయవంచుకుల పాలన పోయింది. నిత్యం వెంకటేశ్వర నామస్మరణ చేసే సేవకుల రాజ్యం వచ్చింది”అని బండి పేర్కొన్నారు.

“మేం ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ హిందువుల ఆరాధ్యదైవమైన తిరుమలను అపవిత్రం చేయడానికి, సొంత ఆష్తులను పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారు. అందుకే రెండు కొండల వాడా గోవిందా..గోవిందా అనే పాలన పోయింది. అరాచక పాలన పీడ విరిగింది. ఏడుకొండల వాడా గోవిందా…గొవిందా.. అని సేవ చేసే రాజ్యం వచ్చింద”న్నారు.

తాను నిన్న ఇక్కడికి వచ్చినప్పటి నుంచీ  ప్రజలు వచ్చి గత పాలకులు చేసిన అక్రమాలు, నిర్వాకాలు చెబుతున్నారని, లంగ దందాలు, లఫంగ దందాలు చేశారని, శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి సంపద, జాతీయ సంపదైన ఎర్ర చందనం స్మగ్లింగ్ పేరుతో రూ.వేల కోట్లు దోచుకుంటూ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారని,  రాజకీయ నేతలను వాళ్ల గుప్పిట్లో పెట్టుకున్నారని… పార్టీలు నడవాలన్నా… ఎన్నికల్లో గెలవాలన్నా తమ చలువ ఉండాలనే స్థాయికి దిగజారారని… చివరకు ప్రభుత్వానికి అప్పులిచ్చే స్థాయికి వచ్చారని ధ్వజమెత్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్