Sunday, January 19, 2025
HomeTrending Newsటచ్ చేసి చూడండి: ప్రశాంత్ రెడ్డి ఛాలెంజ్

టచ్ చేసి చూడండి: ప్రశాంత్ రెడ్డి ఛాలెంజ్

బిజెపి పాలిత రాష్ట్రల్లో రైతుబంధు పథకం ఉందా అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతుబంధు, సాగునీరు మీ పాలిత రాష్ట్రంలో ఇస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. మధ్యప్రదేశ్ నుంచి ఒక నేత ఇక్కడకు వచ్చి కేసీఆర్ మీద మొరిగి వెళ్లిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ది. అస్సాం నుంచి మరొకడు వచ్చి కూడా మొరుగుతున్నాడని శివరాజ్ సింగ్, హేమంత్ బిస్వాస్ లపై తీవ్రంగా  వ్యాఖ్యానించారు. వాళ్ళ రాష్ట్రంలో ఒక ఎకరం భూమి ధర రూ.2 లక్షలు లేదని, ఇక్కడ పుష్కలంగా నీళ్లు, ఉచిత కరెంట్, రైతుబంధు వల్ల భూముల ధరలు పెరిగాయని వివరించారు.   ఒకనాడు ఆంధ్రోళ్లు తెలంగాణ రాష్ట్రంలో భూములు కొనేవారని, ఇప్పుడు తెలంగాణ రైతులు ఆంధ్రాలో భూములు కొంటున్నారని చెప్పారు.  బీజేపీ పాలిత రాష్టాల నుంచి కూలీలుగా తెలంగాణకు రావడం లేదా?  తెలంగాణ వాళ్ళు బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ కు వెళ్తున్నారా అని నిలదీశారు.

బిజెపి రాష్ట్ర నేతలు అర్వింద్, సంజయ్ లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, దమ్ముంటే కేసీఆర్ ను టచ్ చేసి చూడాలని, అప్పుడు తమ దమ్ము ఏంటో చూపిస్తామని సవాల్ చేశారు. వీరిద్దరూ అబద్దాలకోరులని విమర్శించారు.  ‘ఒక్కడికి నెత్తి మీద ఉన్నది. లోపల లేదు… నిజామాబాదోడికి నెత్తిమీద లేదు, లోపల కూడా లేదు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్