వెంకటేష్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. ఈ చిత్రాన్ని హిట్, హిట్ 2 చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. ఇది వెంకీ 75వ చిత్రం కావడం విశేషం. భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్ తో.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకుండానే గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమా పై అంచనాలు పెంచేశారు. ఈ మూవీని డిసెంబర్ 22న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అదే డేట్ కి సలార్ వస్తుండడంతో సైంధవ్ వేరే డేట్ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వద్దామనుకుంటే.. ఎన్నికల హాడావిడి ఉంటుందనే ఉద్దేశ్యంతో సంక్రాంతినే టార్గెట్ చేశారు. ఈ మూవీ జనవరి 13న రిలీజ్ చేయనున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర మరింతగా పోటీ ఏర్పడింది. ఇప్పటికే నాగార్జున నా సామి రంగ, మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, విజయ్ దేవరకొండ, పరశురామ్ మూవీ, తేజ సజ్జ హనుమాన్ చిత్రాలు సంక్రాంతికి వస్తున్నట్టుగా ప్రకటించారు.
ఈ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు రజినీకాంత్ లాల్ సలామ్, శివ కార్తీకేయన్ అయలాన్ మూవీలు కూడా సంక్రాంతికి వస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలతో పాటు ఇప్పుడు వెంకటేష్ సైంధవ్ కూడా వస్తుందని అధికారికంగా ప్రకటించడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. సంక్రాంతికి మూడు లేదా నాలుగు సినిమాలకు ప్లేస్ ఉంటుంది కానీ.. ఈసారి అంతకు మించి ఉండడంతో ఎవరు పోటీ నుంచి తప్పుకుంటారు..? ఎవరు పోటీలో నిలుస్తారు..? ఏ సినిమా సంక్రాంతికి విజేతగా నిలుస్తుంది అనేది ఆసక్తిగా మారింది.