Saturday, January 18, 2025
Homeసినిమారానా కోసం రంగంలోకి వెంకీ, చ‌ర‌ణ్‌?

రానా కోసం రంగంలోకి వెంకీ, చ‌ర‌ణ్‌?

Promotions: ద‌గ్గుబాటి రానా, ఫిదా బ్యూటీ సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం విరాట‌ప‌ర్వం. ఈ చిత్రానికి వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌క్స‌ల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం కావ‌డంతో విరాట‌ప‌ర్వం ఎంత వ‌ర‌కు మెప్పిస్తుంది అనేది ఆస‌క్తిగా మారింది. సాయి ప‌ల్ల‌వి న‌టించిన సినిమా కావ‌డంతో యూత్ లో మంచి క్రేజ్ ఉంది. దీనికి త‌గ్గ‌ట్టుగానే మ‌రింత‌గా ప్ర‌మోష‌న్స్  చేస్తూ.. స్పీడు పెంచారు మేక‌ర్స్.

క‌ర్నూలులో ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే.. అక్క‌డ గాలి, దుమ్ము, వ‌ర్షం రావ‌డంతో ఈవెంట్ ఆగిపోయింది. ఆతర్వాత వ‌రంగ‌ల్ లో విరాట‌ప‌ర్వం ఆత్మీయ వేడుక‌ను నిర్వ‌హించారు.  ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జ‌రిగింది. ఇప్పుడు హైద‌రాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే… ఇప్పుడు విరాట‌ప‌ర్వం కోసం విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రంగంలోకి దిగ‌నున్నార‌ని స‌మాచారం.

వెంకీ రానా బాబాయ్ కాగా, రామ్ చ‌ర‌ణ్.. రానా బెస్ట్ ఫ్రెండ్.. అందుక‌నే వీరిద్ద‌రితో విరాట‌ప‌ర్వం ప్ర‌మోష‌న్స్ చేయించి ఆడియ‌న్స్ లో మ‌రింత‌గా ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. మేక‌ర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెంకీ, చ‌ర‌ణ్ రానున్నార‌ని ప్ర‌క‌టించ‌లేదు కానీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం విరాట‌ప‌ర్వం ప్రీ రిలీజ్ వేడుక‌కు వెంకీ, చ‌ర‌ణ్ రానున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. రానా, సాయిప‌ల్ల‌విల క్రేజ్ కి వెంకీ, చ‌ర‌ణ్ తోడైతే.. విరాట‌ప‌ర్వం చిత్రానికి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

Also Read : ఆలోచింపజేసే విరాట‌ప‌ర్వం ట్రైల‌ర్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్