Tammudu: అక్కినేని అఖిల్ నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ఏజెంట్. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం అఖిల్ మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ కోసం అఖిల్ కష్టపడడం చూసి ఆడియన్స్ కి సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ నెల 15న ఏజెంట్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ కాకుండానే అఖిల్ మరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ డైరెక్టర్ ఎవరంటే… పవర్ స్టార్ తో వకీల్ సాబ్ మూవీని డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ అని సమాచారం. అఖిల్ కోసం ఓ స్టోరీ రెడీ చేశారట. ఈ కథను అఖిల్ కి చెబితే ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఈ భారీ క్రేజీ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారని తెలిసింది. ఇప్పుడు ఈ సినిమాకి పవర్ స్టార్ టైటిల్ ని పరిశీలిస్తున్నారని వార్తలు రావడంతో ఈ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది.
ఇంతకీ ఏంటా టైటిల్ అంటే.. తమ్ముడు అని ప్రచారంలో ఉంది. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. అఖిల్ మూవీకి ఆ టైటిలే సెట్ అవుతుందని ఆలోచిస్తున్నారట వేణు శ్రీరామ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నవంబర్ నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందని టాక్ వినిపిస్తోంది. మరి… ప్రచారంలో ఉన్నట్టుగా తమ్ముడు టైటిల్ నే ఫిక్స్ చేస్తారో మరో టైటిల్ పెడతారో చూడాలి.