Saturday, January 18, 2025
HomeసినిమాAthidhi: కొత్త కాన్సెప్టుతో భయపెట్టే ప్రయత్నం చేసిన 'అతిథి'

Athidhi: కొత్త కాన్సెప్టుతో భయపెట్టే ప్రయత్నం చేసిన ‘అతిథి’

ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే జోనర్లలో హారర్ థ్రిల్లర్ జోనర్ ఒకటి. భయపడుతూనే ఈ తరహా కంటెంట్ ను చూడటానికి చాలామంది ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అందువలన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై హారర్ థ్రిల్లర్ కంటెంట్ వస్తుందంటే చాలు, స్ట్రీమింగ్ డేట్ పై ఓ కన్నేసే ఉంచుతారు. అలా ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తూ హాట్ స్టార్ ద్వారా పలకరించిన వెబ్ సిరీస్ ‘అతిథి’. వేణు తొట్టెంపూడి .. అవంతిక మిశ్రా .. వెంకటేశ్ కాకుమాను .. రవివర్మ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, నిన్నటి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.

సాధారణంగా దెయ్యం కథలు అనగానే .. పగ – ప్రతీకారాలు ప్రస్తావన కనిపిస్తుంది. దెయ్యాలు .. తాము దెయ్యంగా మారడానికి ముందు ఎవరి చేతనైతే హింసించబడ్డారో వాళ్లను పగబడుతూ ఉంటాయి. దెయ్యంగా మారిన తరువాత వాళ్లతో ఒక ఆట ఆడుకుంటూ ఉంటాయి. ఈ తరహా కథలన్నీ కూడా ఊరికి దూరంగా .. ఒక పాడుబడిన బంగ్లానే ప్రధానమైన కేంద్రంగా చేసుకుని నడుస్తుంటాయి. అలా ప్రేక్షకులను మరోసారి బంగళాకు తీసుకెళ్లిన వెబ్ సిరీస్ యే ఇది. ఆ బంగళాలో ఏం జరిగిందనేదే ఇక్కడ సస్పెన్స్.

ఊరికి దూరంగా తన భార్యతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న ఓ రైటర్ .. అతని దగ్గర చాలా డబ్బు ఉందని తెలిసి, ఆ డబ్బును కాజేయడానికి దెయ్యంగా మారిన ఒక మోసగత్తె. ఆమెకి సహకరించే ఒక మోసగాడు. దెయ్యాలు లేవని నిరూపించడం కోసం, దెయ్యాలు ఉన్నాయని చెప్పుకునే చోటుకి వెళ్లే ఒక యూ ట్యూబర్ ఈ కథలో ప్రధానమైన పాత్రధారులు. దెయ్యంగా నటించే యువతీ .. దెయ్యాలు లేవని నిరూపించే యూ ట్యూబర్, ఎలాంటి చోటుకి వచ్చి .. ఎలా చిక్కుబడ్డరానేదే కథ. ఇంట్రెస్టింగ్ గా నడిచే ఈ సిరీస్ కి ఫైనల్ ట్విస్ట్ బలమని చెప్పచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్