Saturday, January 18, 2025
Homeజాతీయంకుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం: వెంకయ్య పిలుపు

కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం: వెంకయ్య పిలుపు

ఎంతో ప్రాశస్త్యం….. తరతరాల చరిత్ర కలిగిన మన కుటుంబ వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలంటూ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని శ్రీ నాయుడు ట్విట్టర్ వేదికగా తెలియ జేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మన సమాజానికి, మన సాంఘిక భద్రత కు మూలాధారం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు.

పిల్లలకు కుటుంబంలోని పెద్దలతో అనుబంధం, వారి అనుభవాల సారం ఎంతో అవసరం అన్నారు. పెద్దలకు కూడా పిల్లలతో సమయం గడపడం వల్ల మానసికోల్లాసం లభిస్తుందని, విలువలతో కూడిన ఈ వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కంకణబద్ధులు కావాలని శ్రీ వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్